ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుపతి ఉప ఎన్నికలో తెదేపాదే గెలుపు: అచ్చెన్నాయుడు - tdp Polit Bureau meeting news

ముఖ్యమంత్రి జగన్.. అసెంబ్లీని వైకాపా కార్యాలయంగా మార్చేశారని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో తెదేపాదే విజయమని స్పష్టం చేశారు.

తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు
తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు

By

Published : Jan 5, 2021, 12:32 PM IST

తిరుపతి ఉప ఎన్నికల్లో తెదేపాదే విజయమని అన్ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. సీఎం అసెంబ్లీని వైకాపా కార్యాలయంలా మార్చేశారని ఆరోపించారు. తెలుగుదేశాన్ని నిర్వీర్యం చేసేందుకు నిత్యం ప్రయత్నిస్తున్నారని అన్నారు. అయినా... వీరోచితంగా ఎదురొడ్డి పోరాడుతున్నారంటూ.. తెదేపా కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు.

"మూడు రాజధానుల విషయంలో అభాసుపాలై... సీఎం తోక ముడుస్తున్నారు. జగన్ క్రిస్టియన్ ముఖ్యమంత్రి... డీజీపీ, హోం మంత్రి కూడా క్రిస్టియన్ లే... దాన్ని మేం తప్పు పట్టడం లేదు. సున్నితమైన విషయాల్లో ఈ ముగ్గురు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి" అని హితవు పలికారు. హిందు దేవలయాలపై దాడుల వెనుక ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details