ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రజలను నమ్మించి మోసం చేసినట్లు తేలిపోయింది' - tdp news updates

వైకాపా ప్రభుత్వం.. ప్రజలను నమ్మించి మోసం చేసినట్లు 5 నెలల్లోనే తేలిపోయిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. విజయవాడలో తెదేపా విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన సర్కారు తీరుపై మండిపడ్డారు. పోలీసు వ్యవస్థను గుప్పెట్లో ఉంచుకొని పాలన సాగించాలనుకోవడం అవివేకమని మండిపడ్డారు.

tdp

By

Published : Nov 4, 2019, 1:14 PM IST

'ప్రజలను నమ్మించి మోసం చేసినట్లు తేలిపోయింది'

విజయవాడ ఏ-కన్వెన్షన్‌ సెంటర్‌లో తెదేపా రాష్ట్ర స్థాయి సమావేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కమిడి కళా వెంకట్రావు అధ్యక్షతన ప్రారంభమైంది.పార్టీ పతాకాన్ని...తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌,పొలిట్ బ్యూరో సభ్యులు,మాజీ మంత్రులు,ఇతర ముఖ్యనేతలు కలసి ఆవిష్కరించారు.ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.అనంతరం..... 14అంశాలపై చర్చించేందుకు రూపొందించిన అజెండా వారీగా సమావేశం నిర్వహిస్తున్నారు.శాసనసభ మాజీ సభాపతి కోడెల శివప్రసాద్,మాజీ ఎంపీ శివప్రసాద్,మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్యతో పాటు ఇటీవల కచ్చులూరు వద్ద బోటు ప్రమాదంలో చనిపోయినవారికి సంతాపంగా మౌనం పాటించారు.

ప్రజలను మోసం చేశారు

వైకాపా సర్కారు...ప్రజలను నమ్మించి మోసం చేసినట్లు5నెలల్లోనే తేలిపోయిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు.రెవెన్యూ,పోలీసు,ఇతర పరిపాలన వ్యవస్థలు వైఫల్యం చెందాయని,ప్రశ్నించే వారిని,మీడియాను బెదిరించి..వారిని అదుపులో ఉంచేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఈ సమావేశంలో మధ్యాహ్నం నుంచి పాల్గొంటారు.

ఇదీ చూడండి:

''ముఖ్యమంత్రి గారూ.. మీరు అలా చెప్పడం తప్పు''

ABOUT THE AUTHOR

...view details