ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉత్తరాంధ్ర బీసీలను దోచుకుంటున్నారు: అనురాధ

పులివెందుల వైకాపా దొంగలు ఉత్తరాంధ్రను నాశనం చేస్తున్నారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ విమర్శించారు. బలహీన వర్గాలు ఎక్కువగా ఉండే విశాఖ పట్టణాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆరోపించారు.

Panchumarty Anuradha
పంచుమర్తి అనురాధ

By

Published : Oct 3, 2020, 12:38 PM IST

బలహీన వర్గాలు ఎక్కువగా ఉండే విశాఖ పట్టణాన్ని "విసా" పట్టణం చేసి అడ్డగోలుగా దోచుకుంటున్నారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. విశాఖలో ట్రస్ట్ పెట్టి ఇళ్ల వెంట తిరుగుతూ... డబ్బులు వసూళ్లు చేస్తున్న వైనంపై విజయసాయిరెడ్డి నోరువిప్పాలని డిమాండ్ చేశారు. పప్పు, బెల్లాలు పంచుతూ... ప్రజల్ని ఏమార్చి అడ్డగోలుగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. పులివెందుల వైకాపా దొంగలు ఉత్తరాంధ్రను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర బీసీలంతా అప్రమత్తంగా ఉండాలని పంచుమర్తి అనురాధ కోరారు.

వారు చర్చకు సిద్ధమా..!

బలహీన వర్గాలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో నకిలీ కరెన్సీ, డ్రగ్స్ మాఫియా, గంజాయి, భూకబ్జాలు, దందాలు, చందాలతో పేట్రేగిపోతున్నాయన్నారు. బీసీలను బెదిరిస్తూ మాఫియా యథేచ్ఛగా రెచ్చిపోతోందని దుయ్యబట్టారు. రౌడీ షీటర్లు వారానికోసారి పార్టీ చేసుకుంటూ ఫోటోలు కూడా దిగుతున్నారని.... వైకాపా కనుసన్నల్లోనే ఈ దారుణాలన్నీ జరుగుతున్నాయని ఆమె ఆక్షేపించారు. వంశధార, నాగవళి ఇసుక మాఫియాపై తమ్మినేని, విజయనగరంలో దందాలు, మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాలు, అప్పన్న భూములపై బొత్స, అనకాపల్లి భూకబ్జాలపై అవంతి చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. ఉత్తరాంధ్రపై కన్నేసిన వైకాపాను తెలుగుదేశం అడ్డుకుని తీరుతుందని పంచుమర్తి అనురాధ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:వైకాపా పాలనలో విధ్వంసం తప్ప అభివృద్ధి లేదు: అయ్యన్న పాత్రుడు

ABOUT THE AUTHOR

...view details