ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఏపీ ఫైట్స్ కరోనా' వెబ్​సైట్ ప్రారంభించిన చంద్రబాబు

'ఏపీ ఫైట్స్‌ కరోనా' వెబ్‌సైట్​ను తెదేపా అధినేత చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమస్యల పరిష్కారమే ప్రధానోద్దేశంగా వెబ్​సైట్ పని చేస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.

tdp starts ap fights corona website
tdp starts ap fights corona website

By

Published : Oct 3, 2020, 5:02 PM IST

Updated : Oct 3, 2020, 5:45 PM IST

'ఏపీ ఫైట్స్ కరోనా' వెబ్​సైట్ ప్రారంభించిన చంద్రబాబు

'ఏపీ ఫైట్స్‌ కరోనా' వెబ్‌సైట్‌లో ప్రజలు నమోదు చేసుకుని ప్రజాగళం వినిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కరోనాకు సంబంధించి ఎలాంటి కష్టనష్టాలనైనా తెలపవచ్చని పేర్కొన్నారు. స్వచ్ఛంద కార్యకర్తలు ఎవరైనా వేదికను సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. సమస్యలను అధికారులకు పంపించి పరిష్కారానికి తెదేపా కృషి చేస్తుందని చంద్రబాబు వెల్లడించారు.

ఉపాధి కోల్పోవడం, మందులు దొరక్కపోవడం, సకాలంలో అంబులెన్స్ లు రాకపోవడం, ఇతర నిత్యావసరాల కొరత, పంట నష్టం, ప్రభుత్వం నుంచి పరిహారం అందకపోవడం.. కరోనాకు సంబంధించిన ఏ అంశాన్నైనా ఈ వేదిక ద్వారా పంచుకోవచ్చని వెల్లడించారు. స్వచ్ఛంద కార్యకర్తలు ముందుకొచ్చి సదరు బాధితులకు సహాయం చేయాలని భావించినా ఈ వేదికను సద్వినియోగం చేసుకోవచ్చని చంద్రబాబు తెలిపారు. వచ్చే సమస్యలన్ని నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా తెలుగుదేశం పార్టీ క్రోడీకరించి సంబంధిత అధికారులకు పంపి, పరిష్కారం కోసం ప్రజల తరఫున కృషి చేస్తుందని పేర్కొన్నారు.

Last Updated : Oct 3, 2020, 5:45 PM IST

ABOUT THE AUTHOR

...view details