తిరుపతి ఉపఎన్నికల ప్రచారానికి.. 30 మందితో స్టార్ క్యాంపెయినర్ల జాబితా సిద్ధం చేసి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి తెదేపా పంపింది. పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణతో పాటు 9 మంది పొలిట్ బ్యూరో సభ్యులు, లోక్ సభ, రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐదుగురు ఎంపీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలకు ఈ జాబితాలో చోటు కల్పించారు.
తిరుపతి ప్రచారానికి తెదేపా స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఖరారు.. ఈసీకి అందజేత - 30 మందితో తెదేపా స్టార్ క్యాంపైనర్ల జాబితా
ఉప ఎన్నిక పోలింగ్ సమీపిస్తుండగా.. తిరుపతిలో ఆయా పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. 30 మందితో ఉన్న స్టార్ క్యాంపెయినర్ల జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి తెదేపా పంపించింది.
![తిరుపతి ప్రచారానికి తెదేపా స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఖరారు.. ఈసీకి అందజేత tdp star campaigners list for tirupati election, tdp star campaigners list for tirupati elections sent to ec](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11231124-437-11231124-1617208461933.jpg)
స్టార్ ఎలక్షన్ క్యాంపైనర్ల జాబితా ఈసీకి పంపిన తెదేపా, తిరుపతి ఉప ఎన్నికకు తెదేపా స్టార్ క్యాంపైనర్ల జాబితా