ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైపీఎస్ అధికారిలా డీజీపీ ప్రవర్తిస్తున్నారు: తెదేపానేత సుధాకర్ రెడ్డి - Tdp spokesperson Sudhakarreddy news

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్​పై తెదేపానేత డాక్టర్ ఎన్​బీ సుధాకర్ రెడ్డి విరుచుకుపడ్డారు. డీజీపీ ఐపీఎస్ అనే విషయం మరచి...వైపీఎస్​లా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.

Tdp spokesperson Sudhakarreddy
తెదేపానేత సుధాకర్ రెడ్డి

By

Published : Jan 15, 2021, 6:59 AM IST

రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ తాను ఐపీఎస్ అన్న విషయం మరచి...వైపీఎస్ అధికారిలా ప్రవర్తిస్తున్నారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్.బి. సుధాకర్ రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్షాలు విగ్రహాల విధ్వంసంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని డీజీపీ మాట్లాడుతున్న తీరే ఇందుకు నిదర్శనం అన్నారు. వరుసగా విగ్రహాల విధ్వంసం జరుగుతుంటే నియంత్రించడం మాని... ప్రతి పక్షాలు కుల, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి అనడం ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు ఉందన్నారు. సవాంగ్ చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలు, భక్తులు, పౌరుల్ని బెదిరించే విధంగా ఉన్నాయని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details