TDP spokesperson Pattabhi: సీఎం జగన్మోహనరెడ్డి ఆర్థిక అవకతవకల పరంపర నానాటికీ వేగంగా ముందుకెళ్తోందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. షెల్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు పెట్టి మనీలాండరింగ్తో అర్జించిన నైపుణ్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా సూట్ కేస్, షెల్ కంపెనీలు పెట్టి వాటి ద్వారా డబ్బులు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆర్థిక నేరాల్లో పీహెచ్డీ చేసిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం ప్రజల దౌర్భాగ్యమని మండిపడ్డారు.
TDP spokesperson Pattabhi: 'ఆ నైపుణ్యంతోనే రాష్ట్రాన్ని దోచుకోవాలని సీఎం జగన్ చూస్తున్నారు' - TDP
TDP spokesperson Pattabhi: సీఎం జగన్మోహనరెడ్డిపై తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. షెల్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు పెట్టి మనీలాండరింగ్తో అర్జించిన నైపుణ్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా సూట్ కేస్, షెల్ కంపెనీలు పెట్టి వాటి ద్వారా డబ్బులు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి గవర్నర్తో పాటు మరికొంతమంది ఐఏఏస్లను షేర్ హోల్డర్లుగా పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలోని అన్నిశాఖలు, కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాలు, సొసైటీల సొమ్ముని ఏపీ స్టేట్ పైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్లో డిపాజిట్ చేయాలని జీవో 1998 ఇచ్చారని అన్నారు. దాన్నిసమర్ధించుకోవటంకోసం పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఉన్న స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సొమ్ము రూ. 9.60 కోట్లు, ఏపీ ఆయిల్ కోఆపరేటివ్ ఫెడరేషన్ డబ్బు రూ. 5 కోట్లు దోపిడీకి గురయ్యాయని ఆరోపించారు. బ్యాంకుల్లో ఉన్నడబ్బుకి భద్రతలేదంటూ జీవో 1998 విడుదల చేశారన్నారు.
ఇదీ చదవండి:Viveka murder case: వివేకా హత్య కేసులో.. సీఎం జగన్ను విచారించాలి: పట్టాభి