TDP Spokesperson Divyavani Meet CBN: 'పార్టీ నుంచి తనను సస్పెండ్ చేసినట్లు వచ్చిన ఫేక్ పోస్టు చూసి కలత చెందాను. ఆ సందర్భంలోనే నిన్న(మంగళవారం) నేను రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశా' అని తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి అన్నారు. తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో అధినేత చంద్రబాబును కలిసిన దివ్యవాణి.. ఈ మేరకు వివరణ ఇచ్చినట్లు చెప్పారు. తప్పుడు వార్తలు సర్క్యులేట్ అయినప్పుడు సమన్వయంతో వ్యవహరించాలని అధినేత చంద్రబాబు సూచించినట్లు ఆమె తెలిపారు. చంద్రబాబుతో సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తనపై విమర్శలు, విశ్లేషణలు చేసిన వారందరికీ కృతజ్ఞతలు అంటూ.. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పార్టీలో చేరినప్పటి నుంచి తన వంతు కృషి చేశానని పేర్కొన్నారు. తాను పార్టీలో పడుతున్న ఇబ్బందులు అధినేత దృష్టికి తీసుకెళ్లినట్లు దివ్యవాణి వివరించారు.
Divyavani: ఆ పోస్టు చూసి కలత చెందా.. అందుకే అలా ట్వీట్: దివ్యవాణి - తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి తాజా వార్తలు
Divyavani meet Chandrababu: తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో అధినేత చంద్రబాబుని పార్టీ అధికార ప్రతినిధి దివ్యవాణి కలిశారు. మంగళవారం తాను రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ చేయడానికి గల కారణాలను అధినేతకు వివరించినట్లు ఆమె చెప్పారు.
Divyavani Post: తెదేపా మహిళ నాయకురాలు దివ్యవాణి రాజీనామా అంశం కలకలం రేపింది. వర్రా రవీందర్రెడ్డి పేరుతో వచ్చిన పోస్ట్ చూసి రాజీనామా చేసేందుకు సిద్ధపడినట్లు ఆమె తెలిపారు. ఆ పోస్టులో క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు దివ్యవాణిని సస్పెండ్ చేస్తున్నట్లు ఉంది. ఈ అంశం తెరపైకి రావడంతో పార్టీ అధిష్టానం అప్రమత్తమైంది. తాము దివ్యవాణిని సస్పెండ్ చేయలేదని.. అది ఫేక్ పోస్టింగ్ అని స్పష్టం చేసింది. ఇప్పుడే కాదు గతంలోనూ కొందరు తప్పుడు పోస్టింగులు పెట్టారని తెదేపా ఆరోపించింది. దీంతో దివ్యవాణి తాను రాజీనామా చేస్తున్నట్లు ట్విటర్లో పెట్టిన పోస్టును తొలగించారు.
ఇదీ చదవండి: