సీఎం జగన్మోహన్రెడ్డికి పాలన చేసే హక్కు లేదని.. తెదేపా అధికార ప్రతినిధి పంచమర్తి అనురాధ అన్నారు. మాస్కులు అడిగినందుకు డాక్టర్ సుధాకర్‌ను సస్పెండ్ చేసి పిచ్చోడిగా చూపి.. కుటంబాన్ని రోడ్డున పడేశారని ఆరోపించారు.
ఇన్ని దాడులు జరుగుతున్నా దళితురాలైన హోంమంత్రి ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. హైకోర్టు 67 సార్లు మొట్టికాయలు వేసినా జగన్‌లో చలనం లేదని విమర్శించారు.