సీఎం జగన్ శుక్రవారం గురించి ఆలోచించకుండా... ఇన్ఛార్జి సీఎంగా వేరే ఒకరిని పెట్టి కోర్టుకు హాజరుకావాలని తెదేపా నేత వర్ల రామయ్య హితవు పలికారు. ఫ్రైడే సీఎంగా కుటుంబ సభ్యులనైనా... జగన్ పెట్టుకోవచ్చని సూచించారు. జగన్కు బెయిల్ ఇచ్చి 7 ఏళ్లు అవుతుందని... కోర్టులు విచారణను వేగవంతం చేయాలని కోరారు. సీబీఐ సైతం ఈ విషయాన్ని తేల్చాలని వర్ల రామయ్య విజ్ఞప్తి చేశారు.
'ఇన్ఛార్జి సీఎంను పెట్టి... శుక్రవారం కోర్టుకెళ్లండి' - వర్ల రామయ్య న్యూస్
అంగబలం, ఆర్థ బలంతో తనపై ఉన్న కేసుల విచారణకు వెళ్లకుండా ఉండటం... సీఎం జగన్కు తగదని తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య విమర్శించారు.
tdp senior leader varla ramaiah comments on cm jagan