ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'బాలకృష్ణను విమర్శించే స్థాయి నారాయణ స్వామికి లేదు' - tdp sc cell President comments on ycp leaders

తెదేపా ఎమ్మెల్యే బాలకృష్ణను విమర్శించే స్థాయి ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామికి లేదని పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎం.ఎస్.రాజు అన్నారు. మానవత్వం లేని ముఖ్యమంత్రి జగన్ వద్ద మంత్రులుగా పనిచేస్తున్నందుకు ఎస్సీ నేతలు సిగ్గుపడాలి.. అని ఆయన వ్యాఖ్యానించారు.

tdp sc cell President ms raju fire on narayanaswamy
బాలకృష్ణను విమర్శించే స్థాయి నారాయణ స్వామికి లేదు

By

Published : Jan 9, 2021, 10:04 AM IST

ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఎంతలా నటించి.. చంద్రబాబు, బాలకృష్ణపై విమర్శలు చేసినా ఆయన పదవికి వైకాపాలో గ్యారంటీ ఉండదని తెదేపా ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎం.ఎస్.రాజు అన్నారు. సీఎం జగన్.. తన మంత్రివర్గం నుంచి తొలగించేవారి జాబితాలో ఎస్సీలైన నారాయణ స్వామి, సుచరిత, ఆదిమూలపు సురేశ్, తానేటి వనిత ముందు వరుసలో ఉంటారని అన్నారు.

మానవత్వం లేని జగన్ వద్ద మంత్రులుగా పనిచేస్తున్నారని.. అందుకు ఎస్సీ నేతలు సిగ్గుపడాలని ఆయన మండిపడ్డారు. బాలకృష్ణను విమర్శించే స్థాయి నారాయణ స్వామికి లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తండ్రి అధికారం అడ్డంపెట్టుకుని రూ. లక్ష కోట్లు అవినీతికి పాల్పడిన జగన్​తో పోల్చితే బావ ముఖ్యమంత్రిగా ఉన్నా ఒక్క ఛార్జ్​షీట్ కూడా లేని బాలకృష్ణ నిజంగా అసమర్థుడేనని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details