కరోనా సమయంలో పొరుగు రాష్ట్రాల సీఎంలంతా ప్రజల్లోకి వెళ్లి సేవలందిస్తే.. మన ముఖ్యమంత్రి జగన్ మాత్రం తాడేపల్లి గడప దాటలేదని తెదేపా ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్.ఎస్. రాజు విమర్శించారు. కరోనాకు చంద్రబాబు భయపడ్డారో, జగన్ భయపడ్డారో ఈ విషయాన్ని బట్టి తెలుస్తుందన్నారు. చంద్రబాబు ఎక్కడున్నా కరోనా నివారణకు వివిధ వేదికల ద్వారా సమావేశాలు నిర్వహించి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందించారని గుర్తు చేశారు.
'సీఎంలంతా ప్రజల్లోకి వెళ్తే.. మన ముఖ్యమంత్రి గడపే దాటలేదు' - తెదేపా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు వార్తలు
కరోనా సమయంలో సీఎం జగన్ ఇల్లు దాటి బయటకు రాలేదని.. చంద్రబాబు మాత్రం వివిధ వేదికల ద్వారా వైరస్ నియంత్రణపై అవగాహన కల్పించారని తెదేపా ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు అన్నారు. ఈ విషయాన్నిబట్టే కరోనాకు ఎవరు భయపడ్డారో అర్థమవుతోందంటూ ఎద్దేవా చేశారు.
ఎంఎస్ రాజు, తెదేపా ఎస్సీ సెల్ అధ్యక్షుడు