'కావాలి ఉచిత ఇసుక- పోవాలి మాఫియా' - tdp on sand issues in andhrapradesh
ఇసుక కొరత సమస్యను పరిష్కరించి భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. ఇసుక కొరతపై విజయవాడలో తెదేపా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది.
రాష్ట్రంలోని ఇసుక కొరతపై విజయవాడలో తెదేపా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి జనసేన, సీపీఐ, సీపీఎం, ఆమ్ ఆద్మీ నాయకులు, కార్మిక సంఘాల నేతలు హాజరయ్యారు. ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని అఖిలపక్ష నేతల డిమాండ్ చేశారు. కావాలి ఉచిత ఇసుక-పోవాలి ఇసుక మాఫియా అని నినాదాలు చేశారు.