TDP book: మూడేళ్ల వైకాపా పాలనలో మహిళలు, యువతులు, చిన్నారులపై అఘాయిత్యాలు, దాడులు విపరీతంగా పెరగాయని తెలుగుదేశం ఆరోపించింది. అత్యాచారాలు, హత్యలు, అసభ్య ప్రవర్తన, వేధింపులకు సంబంధించిన 717 సంఘటనలతో రూపొందించిన జగన్ పాలనలో ఊరికో ఉన్మాది అనే పుస్తకాన్ని బొండా ఉమా, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విడుదల చేశారు. మంత్రి అంబటి రాంబాబు...అప్పట్లో ఓ మహిళతో మాట్లాడిన మాటలు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఒక మహిళతో సాగించిన సంభాషణలు వైకాపా నేతల వికృత రూపానికి అద్దం పడుతున్నాయని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం జాతీయ స్థాయిలో రాష్ట్రం మెుదటి స్థానంలో నిలవడం ప్రభుత్వానికి సిగ్గు చేటని తెదేపా నేత బొండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.
TDP book: జగన్ పాలనలో 'ఊరికో ఉన్మాది' పేరిట... తెదేపా పుస్తకం విడుదల - విజయవాడ లేటెస్ట్ అప్డేట్స్
TDP book: వైకాపా ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ కరవైందని.. 800మంది అతివలపై అఘాయిత్యాలు జరిగాయని తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు. జగన్ పాలనలో ఊరికో ఉన్మాది పేరుతో ప్రచురించిన 50 పేజీల పుస్తకాన్ని విడుదల చేశారు. నిందితుల్లో చాలా మంది వైకాపా నేతలు, సానుభూతిపరులే ఉన్నారని.. వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వైకాపా ఎంపీలు గోరంట్ల మాధవ్, మార్గాని భరత్, బెల్లాన చంద్రశేఖర్‌పై లైంగిక వేధింపుల కేసులు ఉన్నాయని పుస్తకంలో పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పెద్దారెడ్డి, వెంకటరామిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై సైతం కేసులున్నాయని తెలుగుదేశం నేతలు చెప్పారు. రాష్ట్రంలో ఆడబిడ్డల మాన, ప్రాణాలకు ధర కడుతున్నారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు.
మహిళా ఉద్యోగులపై వైకాపా నేతలు వేధింపులకు పాల్పడ్డ ఘటనల్ని పుస్తకంలో ప్రస్తావించారు. ఈ దాడులపై ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోలేదని నేతలు ఆరోపించారు. పుస్తకం తొలి పేజీలో బాధిత మహిళ ఫొటోలు, రెండో పేజీలో మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో ఉన్న వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేల ఫొటోలను ప్రచురించారు. మహిళల భద్రతపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు తెలుగుదేశం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది.
ఇదీ చదవండి:'తిరుపతి రుయా ఆస్పత్రి ఘటన... వైకాపా ప్రభుత్వ వైఫల్యమే'