రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. తెదేపా రెబెల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాల గిరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 173 ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెదేపా రెబెల్ ఎమ్మెల్యేలు ఎవరికి ఓటేశారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. కరణం బలరాం పోలింగ్ ముగియడానికి 25 నిమిషాల ముందు పోలింగ్ కేంద్రానికి వచ్చారు.
గెలవమని తెలిసే వర్ల రామయ్యకు రాజ్యసభ టిక్కెట్ ఇచ్చారని తెదేపా రెబెల్ ఎమ్మెల్యే మద్దాలగిరి ఆరోపించారు. గెలిచే సమయంలో వర్ల రామయ్య తెదేపాకి గుర్తుకు రాలేదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది చంద్రబాబేనని విమర్శించారు. విప్ తనకు అందలేదని పార్టీ నిర్ణయం మేరకే ఓటేశానని మద్దాల గిరి తెలిపారు.