ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పెంచిన విద్యుత్ బిల్లులను తక్షణమే రద్దు చేయాలి' - 'పెంచిన విద్యుత్ బిల్లులను తక్షణమే రద్దు చేయాలి'

లాక్​డౌన్ సమయంలో పెంచిన విద్యుత్ బిల్లులను ర్దదు చేయాలని కోరుతూ... తెదేపా నేతలు తమతమ నివాసాల వద్ద నిరసన దీక్షకు చేపట్టారు. ఉపాధి లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం విద్యుత్ షాక్ ఇచ్చిందని నేతలు మండిపడ్డారు.

'పెంచిన విద్యుత్ బిల్లులను తక్షణమే రద్దు చేయాలి'
'పెంచిన విద్యుత్ బిల్లులను తక్షణమే రద్దు చేయాలి'

By

Published : May 21, 2020, 10:53 PM IST

పెంచిన విద్యుత్ బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... మాజీమంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, పీతల సుజాత, మాజీఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తదితరులు తమతమ నివాసాల వద్ద నిరసన దీక్షకు కూర్చున్నారు. లాక్​డౌన్ సమయంలో ఉపాధి లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే విద్యుత్ షాక్ ఇచ్చారని నేతలు మండిపడ్డారు.

రెండు ఫ్యాన్లు, రెండు బల్బులు, ఒక టీవీ ఉన్న సామాన్యులకు 3వేల బిల్లులు వచ్చాయని ధ్వజమెత్తారు. లాక్​డౌన్ సమయంలో వచ్చిన విద్యుత్ బిల్లులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details