ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విద్యుత్​ ఛార్జీల పెంపుపై తెదేపా నేతల నిరసన... గద్దె రామ్మోహన్​ భిక్షాటన - ఏపీ తాజా వార్తలు

TDP Protest on Electricity charges: ఏపీలో విద్యుత్​ ఛార్జీల పెంపుపై రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతలు నిరసనలు చేపట్టారు. పేదలు విద్యుత్ ఛార్జీలు కట్టేందుకు దానం ఇవ్వాలంటూ భిక్షాటన చేస్తూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వినూత్న నిరసన చేపట్టారు. ఫ్యాన్​కు ఓటేసిన వాళ్లు ఫ్యాన్ కూడా వేసుకోకూడదన్నట్లు ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మండిపడ్డారు.

TDP Protest on Electricity charges
విద్యుత్​ ఛార్జీల పెంపుపై తెదేపా నేతల నిరసనలు

By

Published : Mar 31, 2022, 12:07 PM IST

TDP Protest on Electricity charges: ఏపీలో విద్యుత్​ ఛార్జీల పెంపుపై రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతలు నిరసనలు చేపట్టారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ విజయవాడ 2వ డివిజన్​లో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వినూత్న నిరసన చేపట్టారు. పేదలు విద్యుత్ ఛార్జీలు కట్టేందుకు దానం ఇవ్వాలంటూ భిక్షాటన చేపట్టారు. సిటీ బస్సులు ఆపి ప్రయాణికుల్ని బిచ్చమడిగారు.

ప్రజలు మళ్లీ లాంతర్లతో బతికే రోజులొచ్చాయంటూ లాంతర్ల ప్రదర్శన చేపట్టారు. భిక్షాటన చేస్తే కానీ కరెంట్ బిల్లులు కట్టలేని పరిస్థితి రాష్ట్రంలో ఉందని గద్దె రామ్మోహన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాన్​కు ఓటేసిన వాళ్లు ఫ్యాన్ కూడా వేసుకోకూడదన్నట్లు ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని మండిపడ్డారు. 'జగన్​రెడ్డి బాదుడే బాదుడు' విధానాలపై ప్రజా ఉద్యమం చేపడుతున్నామని తెలిపారు.

ఇదీ చదవండి: జగన్ అసమర్థ పాలనకు విద్యుత్ ఛార్జీల పెంపే నిదర్శనం: అచ్చెన్నాయుడు

ABOUT THE AUTHOR

...view details