ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఐ దుర్గాప్రసాద్​పై చర్యలకు ఆదేశించాలి.. హెచ్​ఆర్సీకి వర్ల రామయ్య లేఖ - మండపేట సీఐ దుర్గా ప్రసాద్​పై చర్యలు తీసుకోవాలని హెచ్​ఆర్సీకి వర్ల రామయ్య లేఖ

Varla Ramaiah: జాతీయ మానవ హక్కుల కమిషన్​కు తెదేపా పొలిట్​బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. మండపేటలో కాళీ అనే యువకుడి ఆత్మహత్యకు కారకుడైన సీఐ దుర్గాప్రసాద్​పై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని లేఖలో పేర్కొన్నారు.

Varla Ramaiah wrote a letter to hrc
హెచ్​ఆర్సీకి వర్ల రామయ్య లేఖ

By

Published : Mar 10, 2022, 7:37 PM IST

Varla Ramaiah: జాతీయ మానవ హక్కుల కమిషన్​కు తెదేపా పొలిట్​బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో కాళీ అనే యువకుడి ఆత్మహత్యకు కారకుడైన.. సీఐ దుర్గాప్రసాద్​పై వెంటనే చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరారు.

సీఐ దుర్గాప్రసాద్ వేధింపులే తమ కుమారుడి ఆత్మహత్యకు కారణమని బాధితుడి తల్లిదండ్రులతో పాటు స్థానికులు చెబుతున్నారని లేఖలో పేర్కొన్నారు. సీఐ దుర్గాప్రసాద్‌ అవినీతిపరుడని... ప్రస్తుత కేసులోనూ లంచం తీసుకున్నాడని పలు ఆరోపణలు వచ్చాయని తెలిపారు.

ఆత్మహత్యకు ప్రేరేపించడం, చిత్రహింసలకు గురిచేయడం, వ్యక్తిగత భాగాలకు తీవ్ర గాయాలు చేసినందుకు.. సీఐపై తగిన సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు.



ఇదీ చదవండి:Suicide: యువకుడి ఆత్మహత్య.. సీఐ కొట్టడం వల్లేనంటూ బంధువుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details