వైకాపా సర్కార్‌పై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. "రాష్ట్రంలో ప్రజా స్వామ్యం ఉందా? వ్యవస్దలు పనిచేస్తున్నాయా" అని ధ్వజమెత్తారు.గత రెండు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఇంటికి దాడి వెళ్ళి.. మళ్ళీ దానిని సమర్దించుకోవడం సిగ్గు మాలిన చర్య అని మండిపడ్డారు.
రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కును వైకాపా ప్రభుత్వం కాలరాస్తోంది. అసలు రాష్ట్రంలో ప్రజా స్వామ్యం ఉందా..? వ్యవస్దలు పనిచేస్తున్నాయా..? డీజీపీ ఆఫీసుకు వైకాపా రంగులు వేసుకోవాలి.