ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… ప్రజల ప్రాణాలు కాపాడాలనే బాధ్యత మరిచి అక్రమ కేసులుతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెదేపా నేత కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ పంపిణీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే.. చంద్రబాబుపై కుట్రపూరితంగా కేసు పెట్టారని విమర్శించారు. ఇకనైనా ప్రతిపక్షాలపై రాజకీయ కక్షపూరిత చర్యలు మానుకుని వైరస్ నివారణ, వ్యాక్సిన్ పంపిణీపై దృష్టి సారించాలని హితవు పలికారు. 18 నుంచి 45ఏళ్ల మధ్య వయసు వారికి వ్యాక్సిన్ ఇవ్వాలనే కేంద్ర మార్గదర్శకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
'కక్ష సాధింపు చర్యలపై కాదు.. వ్యాక్సిన్ పంపిణీపై దృష్టి పెట్టండి' - critics on cm jagan latest news
సీఎం జగన్.. అక్రమ కేసులతో కక్ష సాధింపు చర్యలకు దిగటం దారుణమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు మండిపడ్డారు. ఇలాంటి చర్యలు మానుకోవాలని.. వ్యాక్సిన్ పంపిణీపై దృష్టి సారించాలని హితవు పలికారు.
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు