ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లాక్‌డౌన్‌ విధించి.. కరోనా వ్యాప్తిని అరికట్టాలి- చినరాజప్ప - చినరాజప్ప తాజావార్తలు

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రభుత్వ చర్యలపై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్​డౌన్​ విధించి కరోనా వ్యాప్తిని అరికట్టాలని విజ్ఞప్తి చేశారు.

chinarajappa
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్

By

Published : May 7, 2021, 10:52 PM IST

రాష్ట్రంలో కరోనా చికిత్సకు లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. వైరస్ తీవ్రతతో ప్రజలు భయపడుతుంటే ముఖ్యమంత్రి మాత్రం అవినీతికి ఉపయోగపడే సమీక్షలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రోజుకు 20వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుంటే.. కరోనా నియంత్రణపై చర్యలు తీసుకోవట్లేదని మండిపడ్డారు.

కాంట్రాక్టర్లకు ఏ పనులు అప్పగించాలని.. సీఎం ఆలోచనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరుపై రాజమండ్రిలో వైకాపా నేతలు మాట్లాడింది ప్రజలంతా విన్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించి.. వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సిన్లు పెంచి ప్రజల ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details