ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'గ్రామ సచివాలయాలను మొదటగా చంద్రబాబే ప్రారంభించారు' - వైకాపా నేతలపై ట్విట్ట్​ర్​లో విమర్శించిన తెదేపా నేత అయ్యన్నపాత్రుడు

వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థపై.. తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు ట్విట్టర్ వేదికగా స్పందిచారు. చంద్రబాబు హయాంలో 2001లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టగా.. వైఎస్​ రాజశేఖరరెడ్డి తొలగించారని, ఇప్పుడు సీఎం జగన్ తిరిగి తీసుకొచ్చారని తెలిపారు.

ayyannapatrudu allegations on ysrcp government
గ్రామ సచివాలయ వ్యవస్థపై మాట్లాడిన అయ్యన్నపాత్రుడు

By

Published : Jan 30, 2021, 10:22 PM IST

అయ్యన్నపాత్రుడి ట్వీట్

చంద్రబాబు గతంలో ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయం విధానాన్నే.. సీఎం జగన్ కాపీ చేసి హడావుడి చేస్తున్నారని తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. 2001లో తెదేపా ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయం వ్యవస్థను వైఎస్ రాజశేఖరరెడ్డి తొలగిస్తే.. ఇప్పుడు జగన్ తిరిగి ప్రవేశపెట్టారని ట్విట్టర్​లో విమర్శించారు.

అయ్యన్నపాత్రుడి ట్వీట్

పేటీయం ఎడిట్​లు చేసుకునే 'కే2'కు.. దొంగ లెక్కలు రాయడం మినహా చరిత్ర ఏమి తెలుసని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. 2001లో ఎవరి కోసం దొంగ లెక్కలు రాస్తూ కుర్చున్నావో అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మీ బులుగు బ్యాచ్​ని సంతోష పెట్టమంటూ హితవు పలికారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details