ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TDP: ఫేక్‌ ట్వీట్లు, సోషల్‌ మీడియాలో ప్రచారంపై తెదేపా సీరియస్‌

TDP planning to booklet with Fake Tweets: తెలుగుదేశం పార్టీ నేతలు లక్ష్యంగా ఫేక్‌ ట్వీట్లు, సోషల్‌ మీడియాలో ప్రచారాన్ని తెలుగుదేశం సీరియస్‌గా తీసుకుంది. అసత్యాలు ప్రచారం చేసిన ఫేక్‌ న్యూస్‌తో బుక్‌లెట్‌ వేసే యోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఆ మేరకు కసరత్తు జరుగుతోందని పార్టీ నేతలు తెలిపారు.

TDP planning to booklet with Fake Tweets on social media over leaders
TDP planning to booklet with Fake Tweets on social media over leaders

By

Published : Jun 8, 2022, 3:33 PM IST

TDP planning to booklet with Fake Tweets on social media over leaders: రాష్ట్రంలో ఫేక్‌ ట్వీట్‌ వార్‌ ముదురుతోంది. ఫేక్‌ ట్వీట్లు.. సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారాన్ని తెలుగుదేశం సీరియస్‌గా తీసుకుంది. అంబటి - దేవినేని ఫేక్‌ ట్వీట్‌, గౌతు శిరీష ఘటనల తర్వాత అసత్య ప్రచారానికి కౌంటర్‌ ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తోన్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం లక్ష్యంగా అసత్యాలు ప్రచారం చేసిన ఫేక్‌ న్యూస్‌తో బుక్‌లెట్‌ వేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు, అయ్యన్న, దేవినేని ఉమ, బచ్చుల అర్జునుడు సహా వివిధ నేతల పేర్లతో చేసిన అసత్య ప్రచారాల వివరాలను బుక్‌ లెట్లల్లో పొందుపరచాలని భావిస్తోంది.

ఫేక్‌ ట్వీట్లపై 25 సార్లు ఫిర్యాదు చేసినా.. సీఐడీ పట్టించుకోవట్లేదని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదుల కాపీలను కూడా బుక్‌ లెట్‌లో ప్రచురించేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల ముందు పింక్‌ డైమండ్‌, బాబాయ్ హత్య, కోడి కత్తి వంటి అంశాలను బుక్‌ లెట్​లో ప్రచురించాలని తెదేపా భావిస్తోంది. గతంలో "ఊరికో ఉన్మాది" పేరుతో బుక్‌ లెట్‌ వేసిన తరహాలోనే జగన్‌ మోసపు రెడ్డి పేరుతో బుక్‌ లెట్‌ విడుదల చేసి.. వాటి ప్రతులను ఇంటింటికి పంపిణీ చేయనుంది. వైకాపా అసత్య ప్రచారాలను ప్రజలకు తెలిసేలా.. 'జగన్ మోసపురెడ్డి- ఏపీ ఫేక్ ఫెలోస్' పేరుతో సామాజిక మాధ్యమం వేదికగా ప్రచారం చేసేందుకు తెలుగుదేశం కసరత్తు చేస్తోంది.

ఇదీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details