భారతి సిమెంట్స్ కోసం నిర్మాణ రంగాన్ని నాశనం చేసిన ముఖ్యమంత్రి జగన్..లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. భారతి సిమెంట్స్‌కు వందల కోట్లు దోచిపెట్టడానికే సిమెంట్ వ్యవస్థను సిండికేట్ చేశారని ఆరోపించారు. కొవిడ్ వల్ల కుదేలైన నిర్మాణ రంగాన్ని ఆదుకోకుండా..సిమెంట్ ధరలు పెంచిన ఘనత జగన్‌కే దక్కిందని ఎద్దేవా చేశారు.
సిమెంట్ కంపెనీలతో చర్చలు జరిపి..ధరలు తగ్గేలా చేసే ధైర్యం జే-ట్యాక్స్ వసూలు చేస్తున్న జగన్‌కు లేదని ధ్వజమెత్తారు. జగన్‌కు నిజంగా దమ్ము, ధైర్యముంటే సిమెంట్ కంపెనీలను హెచ్చరించి.. ధరలు తగ్గేలా చేసి, నిర్మాణ రంగాన్ని గాడినపెట్టాలని డిమాండ్ చేశారు.