జాతీయ భావాలున్న ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ పయనిస్తుందని యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో అంశాలవారీగా జాతీయ విధానం ఉంటుందని వెల్లడించారు. కొత్తతరం నాయకత్వం ఎదిగేందుకు ప్రతిపక్షంలో ఉండటం ఓ అవకాశమన్న యనమల.. అధికారంలో ఉంటే ప్రజాసేవకే ప్రాధాన్యం ఉంటుందని... ప్రతిపక్షంలో పోరాటాలకు అవకాశం ఉంటుందని వివరించారు. యువతరానికి ఇది చక్కని అవకాశమన్నారు. ఇప్పటికి మూడు తరాల నాయకత్వం సమర్థవంతంగా.. వ్యవహరించిందని.. మరో నాయకత్వం ఎదిగే అవకాశం వచ్చిందన్నారు. ఎర్రంనాయుడు, బాలయోగి, మాధవరెడ్డి, లాల్ జాన్ బాషా, కోడెల శివ ప్రసాదరావు తదితర నాయకులు తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలబడి.. వాళ్లు ఎదగడమే కాకుండా పార్టీని బలోపేతం చేశారని తెలిపారు. మళ్లీ అంతకుమించిన నాయకత్వం తయారు కావాలని యనమల ఆకాంక్షించారు.
'తెదేపాలో మరోతరం నాయకత్వం ఎదగాల్సిన సమయమిదే' - తెదేపా మహానాడు 2020 తాజా వార్తలు
తెలుగుదేశ పార్టీ చరిత్రలో మరోతరం నాయకత్వం ఎదగాల్సిన సమయం ఇదేనంటూ మహానాడులో కీలకమైన రాజకీయ తీర్మానాన్ని పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు బలపరిచారు.
tdp passes political Resolution in mahanadu 2020