ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుందాం అనే పంథాలో తెలుగుదేశం పార్టీ సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా కమిటీలకు అధినేత చంద్రబాబు శ్రీకారం చుట్టారు. తద్వారా కొత్త నాయకత్వాన్ని ప్రజలకు మరింత చేరువచేయవచ్చన్నది చంద్రబాబు ఆలోచన.
ప్రజలకు చేరువయ్యేందుకు..
2019 ఎన్నికల్లో ఓటమి తరువాత తెలుగుదేశం పార్టీ ఓటమికి గల కారణాలను చంద్రబాబు అధ్యయనం చేస్తూ... వచ్చారు. పార్లమెంట్ స్థానాల వారీగా నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. పార్టీ నాయకులతో సుదీర్ఘ సంప్రదింపులు చేసి పార్టీకి నూతనోత్తేజం తేవాలని నిర్ణయించారు. ప్రజలకు మరింత చేరువవ్వడం, ఎక్కువ మంది యువ నాయకత్వానికి అవకాశాలు కల్పించటం లక్ష్యంగా పార్టీలో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకూ తెదేపాలో ఉన్న జిల్లా పార్టీ విధానం స్థానంలో.. పార్లమెంట్ పార్టీ విధానాన్ని తీసుకురానున్నారు. ఈ విధానం వల్ల ప్రజలకు మరింత దగ్గర అయ్యే అవకాశాలు, ప్రతిపక్షంగా ప్రజల సమస్యలు మరింత లోతుగా అర్ధం చేసుకొని వారి పక్షాన పోరాడటానికి ఉపయోగపడుతుందని పార్టీ అభిప్రాయపడుతోంది. మార్పు వల్ల యువనాయకత్వానికి ఎక్కువ అవకాశాలు కల్పించడానికి వెసులుబాటు ఉంటుదంని తెదేపా అధినాయకత్వం భావిస్తోంది.
పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు