భాజపా నేత విష్ణువర్దన్ రెడ్డిపై జరిగిన దాడిని తెదేపాకు అంటకట్టాలని చూడొద్దని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు అన్నారు. భౌతిక దాడులు, కుట్ర రాజకీయాలు, విధ్వంసకర నిర్ణయాలు ఏ పార్టీ సిద్ధాంతాలో అందరికీ తెలుసని మండిపడ్డారు. ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత విమర్శల మధ్య జరిగిన ఘర్షణలో తెదేపాను నిందించడం సరికాదన్నారు.
'భాజపా నేతపై దాడి ఘటనలోకి తెదేపాను లాగొద్దు' - భాజపా నేత విష్ణువర్దన్ రెడ్డి దాడిపై తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు
భాజపా నేత విష్ణువర్దన్ రెడ్డిపై జరిగిన దాడిలోకి తెదేపాను లాగొద్దని ఆ పార్టీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు అన్నారు. భౌతిక దాడులు, కుట్ర రాజకీయాలు ఏ పార్టీ సిద్ధాంతాలో ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు.
'భాజపా నేతపై దాడిలోకి తెదేపాను లాగొద్దు '
ఇటీవల ఓ ఛానెల్ నిర్వహించిన చర్చ సందర్భంగా అమరావతి పరిరక్షణ ఐకాస కన్వీనర్ శ్రీనివాస్, విష్ణువర్థన్ రెడ్డిపై దాడి చేశారు.