ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సలాం కుటుంబానికి న్యాయం చేయాలనే ఆలోచన జగన్​కు లేదు' - తెదేపా అధికార ప్రతినిధి నాగుల్ మీరా

సలాం కుటుంబానికి న్యాయం చేయాలనే ఆలోచన సీఎం జగన్ మనసులో లేదని తెదేపా అధికార ప్రతినిధి నాగుల్ మీరా విమర్శించారు. చిత్థశుద్ధి ఉంటే అసలు దోషులకు శిక్షపడేలా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

'సలాం కుటుంబానికి న్యాయం చేయాలనే ఆలోచన జగన్​కు లేదు'
'సలాం కుటుంబానికి న్యాయం చేయాలనే ఆలోచన జగన్​కు లేదు'

By

Published : Nov 20, 2020, 6:58 PM IST

ముఖ్యమంత్రి జగన్ సలాం కుటుంబాన్ని బలవంతంగా కర్నూలు పిలిపించుకుని పరామర్శించారని తెదేపా అధికార ప్రతినిధి నాగుల్ మీరా విమర్శించారు. కర్నూలు నుంచి నంద్యాల వెళ్లి సలాం కుటుంబాన్ని పరామర్శించలేకపోయారని మండిపడ్డారు. రావటం ఇష్టంలేదని సలాం అత్త చెప్పినా.. అధికారులు బలవంతంగా తీసుకెళ్లారని ఆరోపించారు. సలాం కుటుంబానికి న్యాయం చేయాలనే ఆలోచన సీఎం మనస్సులో లేదని స్పష్టమైందన్నారు. చిత్థశుద్ధి ఉంటే అసలు దోషులకు శిక్షపడేలా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details