ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వక్రభాష్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు: కనకమేడల - మూడు రాజధానులు తాజా వార్తలు

న్యాయస్థానాల తీర్పులపై శాసనసభలో వక్రభాష్యాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని.. తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. చట్టాల ప్రకారమే పార్లమెంటులో పునర్విభజన చట్టం చేశారని గుర్తు చేశారు. దాని ప్రకారమే రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

వక్రభాష్యాలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దు
వక్రభాష్యాలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దు

By

Published : Mar 27, 2022, 3:20 PM IST

వక్రభాష్యాలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దు

కోర్టు తీర్పులపై శాసన సభలో వక్రభాష్యాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని.. రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ సూచించారు. కోర్టుల పట్ల బెదిరింపు ధోరణి సరికాదన్నారు. ప్రభుత్వ తీరు రాజ్యంగ ఉల్లంఘనేనన్న ఆయన.. న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోబోవని హెచ్చరించారు. చట్టాల ప్రకారమే పార్లమెంటులో పునర్విభజన చట్టం ఇప్పటికే చేశారని గుర్తు చేసిన ఎంపీ.. దాని ప్రకారమే రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

"రాజధాని మార్చే అధికారం ఉందని కేంద్రం చెప్పిందని అంటున్నారు. రాజ్యాంగాన్ని విశ్లేషించేందుకు కేంద్రం సుప్రీం కాదు. కేంద్ర ప్రభుత్వమే పునర్విభజన చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించింది. ప్రభుత్వాలు అంటే వ్యక్తులు కాదు.. సంస్థలు అని గుర్తించాలి. ప్రభుత్వాలు కొనసాగుతాయి.. వ్యక్తులు మారుతారు. పార్టీలు మారితే రాజ్యాంగాన్ని మారుస్తామంటే కుదరదు. రాజ్యాంగాన్ని పరిరక్షించే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవు. జడ్జీలను బెదిరిస్తున్నారు, న్యాయవ్యవస్థను దూషిస్తున్నారు. కోర్టుల పట్ల బెదిరింపు ధోరణితో ఉన్నట్లు భావించాల్సి వస్తోంది. చట్టాలను మార్చే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది. వక్రభాష్యాలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దు." - కనకమేడల రవీంద్ర కుమార్, తెదేపా ఎంపీ

సంక్షేమ కార్యక్రమాలు అనేది బూటకం: రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల అమలు అనేది ఓ బూటకమని తెదేపా ఎంపీ రామ్మోహన్ రావు అన్నారు. రాష్ట్రానికి ఎలాంటి పెట్టుబడులూ తీసుకురావట్లేదని మండిపడ్డారు. రాష్ట్రానికి రూ.85 వేల కోట్ల ఆదాయం వస్తోందని.., కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు మంజూరు చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఖర్చులకు రూ.86 వేల కోట్లు పోతున్నాయన్న ఆయన.. అదనపు ఆదాయం మాత్రం ఉత్పత్తి కావట్లేదని అన్నారు. పన్నుల రూపంలో పేదలను దోచుకుంటున్నారన్నారు. చివరకు చెత్త మీద కూడా పన్నులు వేసి ప్రజలను పీడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి

cm jagan : 11న మంత్రిమండలి పునర్‌వ్యవస్థీకరణ?

ABOUT THE AUTHOR

...view details