ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఈసీని కలిసిన తెదేపా ఎంపీలు..రాళ్లదాడి ఘటనపై ఫిర్యాదు - ఎన్నికల సంఘాన్ని కలిసిన తెదేపా ఎంపీలు

తిరుపతి ఉప ఎన్నికలో కేంద్ర బలగాలతో పోలింగ్ జరపాలని తెదేపా ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని, హోంశాఖ కార్యదర్శిని కోరారు. చంద్రబాబు ప్రచార సభలో జరిగిన రాళ్ల దాడిపై ఫిర్యాదు చేసిన ఎంపీలు..పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సీఈసీకి వినతి పత్రం అందజేశారు.

tdp mp's meet Central Election Commission
సీఈసీని కలిసిన తెదేపా ఎంపీలు

By

Published : Apr 13, 2021, 4:51 PM IST

Updated : Apr 13, 2021, 7:13 PM IST

సీఈసీని కలిసిన తెదేపా ఎంపీలు

చంద్రబాబు తిరుపతి ప్రచార సభలో జరిగిన రాళ్ల దాడిపై తెదేపా ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని, కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కలిసి ఫిర్యాదు చేశారు. సీఈసీని కలిసిన ఎంపీలు గల్లా జయదేవ్​, రామ్మోహన్​నాయుడు, కేశినేని, కనకమేడల దాడి ఘటనపై వినతిపత్రం అందించారు. తిరుపతి ఉప ఎన్నికలో కేంద్ర బలగాలతో పోలింగ్ జరపాలని కోరారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని విన్నవించారు. 2 లక్షల నకిలీ ఓటరు కార్డులు ఉన్నాయని, రెండు అదనపు గుర్తింపు కార్డులు ఉంటేనే ఓటు వేసే అవకాశం ఇవ్వాలన్నారు.

పోలింగ్ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకులను నియమించాలని కోరిన ఎంపీలు..ఎన్నికల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వంలోని వాలంటీర్లు భాగం చేయకుండా చూడాలని అభ్యర్థించారు.

రాళ్ల దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఎంపీ రామ్మోహన్‌

సీఈసీని కలిసిన తెదేపా ఎంపీలు..రాళ్లదాడి ఘటనపై ఫిర్యాదు

లోక్‌సభ ఎన్నికల వేళ సీఈసీకి బాధ్యత ఎక్కువ ఉంటుందని ఎంపీ రామ్మోహన్‌ వ్యాఖ్యానించారు. తిరుపతి ఎన్నికలకు కేంద్ర బలగాలు పంపాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కోరామన్నారు. రాళ్ల దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.ఈ ఘటనపై సరైన దిశగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రచారానికి మరింత భద్రత కల్పించాలన్నారు. వైకాపాకు ఓటేయకుంటే పథకాలు ఆగుతాయని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఓట్లు దండుకోవాలనే ఆలోచనతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు.

ఇదీచదవండి

మందుపాతరలకే భయపడలేదు.. గులకరాళ్లకు జంకుతానా?: చంద్రబాబు

Last Updated : Apr 13, 2021, 7:13 PM IST

ABOUT THE AUTHOR

...view details