ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TDP MP's in all party meeting at Delhi: దిల్లీ అఖిలపక్ష భేటీలో.. తెదేపా ఎంపీలు ఏం చెప్పారంటే? - vijayawada latest news

దిల్లీలో నేడు జరిగిన అఖిలపక్ష సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు(TDP MP's in all party meeting at Delhi) పాల్గొన్నారు. రాష్ట్రంలో సామాన్యులు ఎదుర్కొంటున్న పెట్రోధరల సమస్యతోపాటు వివిధ అంశాలను ప్రస్తావించారు.

TDP MP's in all party meeting
TDP MP's in all party meeting

By

Published : Nov 28, 2021, 6:13 PM IST

దిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష భేటీలో తెదేపా ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్​, గల్లా జయదేవ్(TDP MP's in all party meeting held at Delhi) పాల్గొన్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాలో కనుగొన్న ఒమిక్రాన్ అనే కొత్త కరోనా వేరియంట్​పై సమావేశంలో చర్చించారు. అదేవిధంగా.. కేంద్రం పెట్రో ధరలను తగ్గించినప్పటికీ.. అందుకు అనుగుణంగా ఏపీలో ఇంధన ధరలను తగ్గించలేదనే విషయాన్ని సమావేశంలో లేవనెత్తారు.

ఏకీకృత నిబంధన తెచ్చి దేశమంతా ఒకే ధర ఉండేలా చూడాలని వారు కోరారు. విశాఖ ఉక్కు, ఇతర సంస్థల ప్రైవేటీకరణ వద్దని కోరినట్లు తెదేపా ఎంపీలు తెలిపారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details