ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TDP MPs on Budget: వైకాపా వైఫల్యాల వల్లే బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం: తెదేపా ఎంపీలు - mp kanakamedala

TDP MPs on Budget-2022: వైకాపా ప్రభుత్వ వైఫల్యం కారణంగానే బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని తెలుగుదేశం ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీని చీకట్లోకి నెట్టి దేశానికి అమృత్‌కాల్‌ అంటే ఎలా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా.. కేసుల మాఫీ కోసమే సీఎం దిల్లీకి వెళ్లారని ఆరోపించారు.

Media conference of TDP MPs
తెదేపా ఎంపీల మీడియా సమావేశం

By

Published : Feb 1, 2022, 7:36 PM IST

కేంద్ర బడ్జెట్‌-2022ను అమృత్‌కాల్ బడ్జెట్‌గా ప్రచారం చేస్తున్నారని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ అన్నారు. ఏపీని చీకట్లోకి నెట్టి దేశానికి అమృత్‌కాల్‌ అంటే ఎలా? అని ఎంపీ గల్లా జయదేవ్​ ప్రశ్నించారు. విభజన చట్టం హామీలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని.. తాజాగా రాష్ట్ర ప్రజలను మరోసారి అనిశ్చితిలోకి నెట్టారని విమర్శించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రవేశ పెట్టిన బడ్జెట్​పై తెదేపా ఎంపీలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బడ్జెట్​ను విశ్లేషించారు. వైకాపా ప్రభుత్వం వైఫల్యాల వల్లే బడ్జెట్‌ కేటాయింపులల్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, విశాఖ రైల్వే జోన్‌ ఎక్కడ?. హామీ ఇచ్చిన విద్యాసంస్థలు ఎక్కడ.. వాటికి నిధులు ఏవీ..?. బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి ఎక్కువ కేటాయింపులు లేవు. అయితే.. ఇళ్ల నిర్మాణానికి కేటాయింపులు, పీఎం గతిశక్తి ద్వారా మల్టీమోడల్ లాజిస్టిక్ హబ్‌ తేవడం బాగుంది. నదుల అనుసంధాన ప్రణాళిక, బ్లాక్‌ చైన్ టెక్నాలజీ ద్వారా డిజిటల్ రూపీ రాకను ఆహ్వానిస్తున్నట్లు గల్లా జయదేవ్​ చెప్పారు.

సీఎం జగన్​ దిల్లీకి అందుకే వెళ్లారా ?: కనకమేడల

రాష్ట్ర వాటా ఇవ్వకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు ఆగాయని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్​ ఆరోపించారు. వైకాపా చర్యల వల్లే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని.. అసంబద్ధమైన హామీలిచ్చి జగన్​ అధికారంలోకి వచ్చారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తారని అధికార పార్టీ నేతలు చెప్పారు.. బడ్జెట్‌లో ఏమీ లేదు.. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచాలని కోరేందుకే సీఎం జగన్​ దిల్లీ వెళ్లారా ? అని కనకమేడల ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

SUICIDE: అప్పుల బాధ తాళలేక!... చేనేత కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details