ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పౌరసత్వ సవరణ బిల్లు లౌకికవాదానికి వ్యతిరేకం: ఎంపీ కేశినేని

కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు దేశ లౌకికవాదానికి వ్యతిరేకంగా ఉందని తెదేపా ఎంపీ కేశినేని నాని అన్నారు. నాడు లౌకికవాద స్ఫూర్తితోనే తెదేపాను స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించారని, నేడు చంద్రబాబు నడిపిస్తున్నారని తెలిపారు.

tdp-mp-keashineni-nani-comments-on-citizenship-ammendment-bill
tdp-mp-keashineni-nani-comments-on-citizenship-ammendment-bill

By

Published : Dec 16, 2019, 7:53 PM IST


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు ముస్లిం సమాజానికి నష్టం చేకూరేలా ఉందని తెదేపా ఎంపీ కేశినేని అన్నారు. వ్యక్తిగతంగా తాను బిల్లును వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. ఈ బిల్లు లౌకికవాదానికి వ్యతిరేకమని వ్యాఖ్యానించారు. బిల్లుకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని అంశాలను పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ముస్లింల పట్ల సీఎం జగన్​కు ఏ మాత్రం చిత్తుశుద్ధి ఉన్నా.. రాష్ట్రంలో ఎన్​ఆర్సీ బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం మైనార్టీలకు అండగా నిలిచినందుకు ఎంపీ కేశినేనిని విజయవాడ ఆయా సంఘాల నాయకులు సన్మానించారు.

పౌరసత్వ సవరణ బిల్లు లౌకికవాదానికి వ్యతిరేకం:ఎంపీ కేశినేని

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details