ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆ విషయంలో వైకాపాకు మద్దతిస్తాం: తెదేపా ఎంపీ కనకమేడల - Kanakamedala ravindra kumar Comments

Kanakamedala on Special status: వైకాపాకు 28 మంది ఎంపీలున్నా ప్రత్యేక హోదా అంశం విషయమై కేంద్రంపై ఒత్తిడి తేవట్లేదని తెదేపా ఎంపీ రవీంద్ర కుమార్ విమర్శించారు. వైకాపా ఎంపీలు రాజీనామా చేసి ప్రత్యేక హోదాపై పోరాడితే... తామూ కలసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

తెదేపా ఎంపీ కనకమేడల
తెదేపా ఎంపీ కనకమేడల

By

Published : Feb 13, 2022, 3:51 PM IST

Kanakamedala on Special status: వైకాపా ఎంపీలు రాజీనామా చేసి ప్రత్యేక హోదాపై పోరాడితే.. తామూ కలసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం వైకాపా కార్యాచరణకు తమ మద్దతు ఉంటుందన్నారు. వైకాపాకు 28 మంది ఎంపీలున్నా కేంద్రంపై ఒత్తిడి తేవట్లేదని విమర్శించారు. హోదాకు తెలంగాణ సహకారం ఉన్నా వైకాపా ఎందుకు వైఫల్యం చెందుతుందో అర్థం కావట్లేదన్నారు.

"అజెండాలో ప్రత్యేక హోదా అంశం ఎందుకు పెట్టలేదు ?. వైకాపా ప్రభుత్వానికి కేంద్రంతో ఉన్న ఒప్పందమేంటి ?. అజెండా మారడానికి జగన్‌ కేంద్రానికి రాసిన లేఖనే కారణం. వైకాపాకు 28 మంది ఎంపీలున్నా కేంద్రంపై ఒత్తిడి తేవట్లేదు. హోదాకు తెలంగాణ సహకారం ఉన్నా వైకాపా ఎందుకు వైఫల్యం చెందుతుంది. ప్రత్యేక హోదా అంశంపై వైకాపా వైఫల్యమా ? లొంగుబాటా ?. వైకాపాపై మాకు అనుమానం కలుగుతోంది. అజెండాలో హోదా అంశం ఎవరు చెబితే తొలగించారు ?. హోదాపై మంచైతే వైకాపాకు.. చెడైతే చంద్రబాబుపై నెడుతున్నారు. ప్రాణమిత్రులు విభజన హామీలు ఎలా పరిష్కరిస్తారో చెప్పాలి ?. వైకాపా వల్ల కాదని జగన్‌ చెబితే మా కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రత్యేక హోదా కోసం వైకాపా పోరాడితే మేము కలిసివస్తాం. హోదా కోసం వైకాపా ఎంపీలు రాజీనామా చేయండి. వైకాపా ఎంపీలతో పాటు మేము కూడా రాజీనామా చేస్తాం. కేంద్రం హోదా ఇవ్వకపోతే వైకాపా కార్యాచరణ ఏంటో చెప్పాలి ?." - కనకమేడల రవీంద్ర కుమార్ తెదేపా ఎంపీ

ABOUT THE AUTHOR

...view details