న్యాయసంబంధమైన అంశాలను పార్లమెంట్‌లో ప్రస్తావించడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తెలుగుదేశంఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. రాజ్యసభలో కొవిడ్‌పై చర్చ సందర్భంగా... కోర్టు ఉత్తర్వులను వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తావించడాన్ని తెదేపా ఎంపీలు తీవ్రంగా ఖండించారు. విజయసాయి రెడ్డి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఎంపీగా కొనసాగేందుకు విజయసాయిరెడ్డి అర్హత కోల్పోయారని, ఈ అంశాన్ని రాజ్యసభ ఛైర్మన్, న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్తామని కనకమేడల తెలిపారు.
'ఎంపీగా కొనసాగే అర్హతను విజయసాయిరెడ్డి కోల్పోయారు' - విజయసాయిరెడ్డి తాజా వార్తలు
ఎంపీగా కొనసాగే అర్హతను విజయసాయిరెడ్డి కోల్పోయారని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. రాజ్యసభలో కోర్టు ఉత్తర్వులను ప్రస్తావించడాన్ని ఆయన తప్పుబట్టారు. న్యాయసంబంధమైన అంశాలను పార్లమెంట్‌లో ప్రస్తావించడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందన్నారు.
ఎంపీగా కొనసాగే అర్హతను విజయసాయిరెడ్డి కోల్పోయారు