దిల్లీ పర్యటన వివరాలు చెప్పాలని సీఎం జగన్‌ను కోరుతున్నట్లు తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు. ఏ ప్రాజెక్టుకు ఎన్ని నిధులు అడిగారో సీఎం జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ ఇప్పటివరకు 30 సార్లు దిల్లీకి వచ్చి ఐదు సార్లు ప్రధాని మోదీని కలిశారన్నారు. ప్రధానికి విన్నవించిన వివరాలు.., ప్రధాని స్పందన తెలియజేయాలన్నారు. జగన్ వినతిపత్రాలు పీఎంవోలో ఏ స్టేజ్‌లో ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఫైల్స్ నెంబర్లు చెబితే తాము కూడా కేంద్రమంత్రుల వెంటపడతామన్నారు. సీఎం జగన్ రాసిన లేఖల వల్లే పోలవరం పనుల్లో జాప్యం జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఈ మూడేళ్లలో పెట్టిన ఖర్చు ఎంత? అని ప్రశ్నించారు. 'జగన్‌ది.. రివర్స్ టెండరింగే కాదు.. రివర్స్ పాలన కూడా..' అంటూ ఎద్దేవా చేశారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో ఇప్పటికీ చెప్పటం లేదని అన్నారు.