జీవో నెం.77 రద్దు చేయాలని కోరుతూ.. సీఎం ఇంటి ముట్టడికి యత్నించిన టీఎన్ఎస్ఎఫ్ నేతలపై తప్పుడు కేసులు పెట్టడంపై.. తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు మండిపడ్డారు. రక్షకులే చట్టాలను మారుస్తున్నారని విమర్శించారు.
వాళ్లు ఎవరిమీద అత్యాచారం చేశారో డీజీపీ సమాధానమివ్వాలి
ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి వచ్చిన విద్యార్థి నేతలపై.. అత్యాచారం కేసు పెడతారా అని ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు ప్రశ్నించారు. వాళ్లు ఎవరి మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నించారో డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే ఇతర రాష్ట్రాల్లో జరిగిన నేరాలు కూడా.. రాష్ట్రంలోని విద్యార్థులకు, ప్రజా సమస్యలపై పోరాటం చేసే వారికి అంట గట్టేటట్టుందని ధ్వజమెత్తారు.