ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో వెంటనే.. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి: ఎమ్మెల్సీ మంతెన

రాష్ట్రంలో ప్రజలు ఆక్సజన్ లేక ప్రాణాలు కోల్పోయే దుస్థితి రావటం ముఖ్యమంత్రి జగన్ చేతకాని తనమేనని.. తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు విమర్శించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణపై.. వైకాపా నేతలు వాస్తవాలు దాస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర పరిణామాలు దృష్ట్యా.. వెంటనే ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించాలని డిమాండ్ చేశారు.

mlc manthena satyanarayana raju
mlc manthena satyanarayana raju

By

Published : May 7, 2021, 7:06 PM IST

రాష్ట్రంలో కరోనా నియంత్రణపై.. వైకాపా నేతలు వాస్తవాలు దాస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు ధ్వజమెత్తారు. ప్రజలు ఆక్సజన్ లేక ప్రాణాలు కోల్పోయే దుస్థితి రావటం ముఖ్యమంత్రి జగన్ చేతకాని తనమేనన్నారు. రాష్ట్రంలో వైద్యం అందక.. పొరుగు రాష్ట్రాలకు ప్రజలు తరలిపోతుంటే.. ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజుల రూపంలో రూ.లక్షలు దోచుకుంటున్నారని మండిపడ్డారు.

ప్రజల ప్రాణాలు పట్టించుకోని సీఎం జగన్ రెడ్డి.. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు మేలు చేసే పనిలో బిజీగా ఉన్నారని విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర పరిణామాలు దృష్ట్యా.. వెంటనే ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించాలని మంతెన డిమాండ్ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details