ప్రజాస్వామ్యంలో నియంతలకు చోటు లేదని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు అన్నారు. ప్రశ్నించినవాడిని జైల్లో వేస్తూ.. సీఎం జగన్ తన సైకోయిజాన్ని బయటపెట్టారని ధ్వజమెత్తారు. విధ్వంసంతో మొదలైన పాలన అరాచకంతో కొనసాగుతోందని విమర్శించారు. బీసీ నాయకుడు అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టును పక్కదారి పట్టించేందుకే.. జేసీ కుటుంబాన్ని అరెస్ట్ చేయించారని ఆరోపించారు.
ప్రభాకర్ రెడ్డి,అస్మిత్ రెడ్డిల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంతెన సత్యనారాయణరాజు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపైనా కక్షసాధింపు చర్యలు మానాలని హితవు పలికారు.