ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

MLC MANTHENA: అశోక్ గజపతిరాజు కుటుంబాన్ని తిడితేనే పార్టీలో ఉండనిస్తామన్నారా? - ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ తాజా వార్తలు

కరోనా తీవ్రతలో పన్నుల భారం మోపుతూ.. గజపతిరాజులు పన్నులు వసూలు చేశారని విమర్శించటం విడ్డూరంగా ఉందని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు అన్నారు. అశోక్ గజపతిరాజు కుటుంబాన్ని తిడితేనే.. ఎంపీ బెల్లాని చంద్రశేఖర్​ను పార్టీలో ఉండనిస్తామనే ఆదేశాలు అధిష్ఠానం నుంచి వచ్చాయా? అని నిలదీశారు.

mlc manthena satyanarayana
అశోక్ గజపతిరాజు కుటుంబాన్ని తిడితేనే పార్టీలో ఉండనిస్తామన్నారా

By

Published : Jun 29, 2021, 10:50 PM IST

అశోక్ గజపతిరాజు కుటుంబాన్ని తిడితేనే.. ఎంపీ బెల్లాని చంద్రశేఖర్​ను పార్టీలో ఉండనిస్తామనే ఆదేశాలు అధిష్టానం నుంచి వచ్చాయా? అని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు నిలదీశారు.

"అశోకగజపతి రాజు చరిత్ర తెలిసి కూడా విజయసాయిరెడ్డి, జగన్ రెడ్డి ఆదేశాలతోనే.. విజయనగరం ఎంపీ రాజకీయ పబ్బం కోసం విమర్శలు చేస్తున్నారు. లక్షల కోట్లు విలువ చేసే వేల ఎకరాలు దానం చేసిన చరిత్ర గజపతిరాజులది అయితే.. లక్షల కోట్లు అవినీతికి పాల్పడి దోపిడీ చేసిన చరిత్ర వైకాపా నేతలది. కరోనా తీవ్రతలో పన్నుల భారం మోపుతూ గజపతిరాజులు పన్నులు వసూలు చేశారని విమర్శించటం విడ్డూరం. దొడ్డిదారిన సంచయితను తీసుకొచ్చిన విజయసాయి.. న్యాయస్థానం తీర్పును దిక్కరిస్తూ అశోక్ గజపతిరాజుపై నిందలు వేస్తున్నారు."అని దుయ్యబట్టారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details