ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైకాపా నవరత్నాల్లో 'బూతులు' భాగమా?: ఎమ్మెల్సీ మంతెన - mlc manthena spoke about navaratnalu

మంత్రి కొడాలి నానిపై తెదేపా ఎమ్మెల్యీ మంతెన సత్యనారాయణ రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయనకు సోడా బుడ్డి, మందు బుడ్డికి మాత్రమే తేడా తెలుసన్నారు. నారా లోకేశ్​పై ఇష్టం వచ్చినట్లు నోరుపారేసుకుంటే సహిచబోమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

mlc manthena allegations on minister kodali nani
మంత్రి కొడాలి నానిపై ఎమ్మెల్సీ మంతెన విమర్శలు

By

Published : Mar 21, 2021, 6:04 PM IST

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేశ్​ మీద అధికార పార్టీ నేతల విమర్శలను తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు తిప్పి కొట్టారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించిన నేతను దూషించడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రవేశపెట్టిన నవరత్నాల్లో 'బూతులు' ఒక భాగమా అని ప్రశ్నించారు. తాగి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

2004, 2009లో కొడాలి నానికి తెదేపానే టికెట్ ఇచ్చినట్లు ఎమ్మెల్సీ మంతెన గుర్తుచేశారు. 36 అవినీతి కేసుల్లో సీఎం జగన్ ఎందుకు నిందితుడిగా ఉన్నారో తెలియదా అని ప్రశ్నించారు. సోడా బుడ్డి, మందు బుడ్డికి మాత్రమే మంత్రికి తేడా తెలుసని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన బూతులకు దేవుడు బుద్ధి చెప్పేరోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details