మంత్రి పదవి రెన్యువల్ కోసమే కొడాలి నాని చంద్రబాబును విమర్శిస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు దుయ్యబట్టారు. ప్రతి ఒక్కరికీ మంత్రి పదవి రెండున్నరేళ్లేనని జగన్ ముందే చెప్పినందున... తనను మంత్రిగా కొనసాగిస్తారనే ఆశతో కొడాలి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మంత్రి పదవి చేపట్టినా...తెదేపా ఎమ్మెల్యేలను వైకాపాలో చేర్చే పనిలోనే ఉన్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు.
మంత్రి పదవి రెన్యువల్ కోసమే కొడాలి విమర్శలు: ఎమ్మెల్సీ మంతెన - కొడాలి నానిపై మంతెన వ్యాఖ్యలు
మంత్రి కొడాలి నానిపై తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి పదవి రెన్యువల్ కోసమే కొడాలి చంద్రబాబును విమర్శిస్తున్నారని ఆక్షేపించారు.
కొడాలి విమర్శలు మంత్రి పదవి రెన్యూవల్ కోసమే