ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాజధాని నిర్మాణ సామగ్రిని వైకాపా నేతలు అమ్ముకుంటున్నారు' - తెదేపా ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి కామెంట్స్

రాజధాని నిర్మాణ సామగ్రిని వైకాపా నేతలు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని తెదేపా ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి ఆరోపించారు. అప్పులు, పన్నులు, ఆస్తుల అమ్మకం, ప్రశ్నిస్తే దాడులు, ఎదిరిస్తే కేసుల పంచసూత్ర పాలన తప్ప ఏమీలేదని వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

రాజధాని నిర్మాణ సామగ్రిని వైకాపా నేతలు అమ్ముకుంటున్నారు
రాజధాని నిర్మాణ సామగ్రిని వైకాపా నేతలు అమ్ముకుంటున్నారు

By

Published : Nov 23, 2020, 6:53 PM IST

న్యాయస్థానం స్టేటస్​కో విధించినా..విశాఖలో 30 ఎకరాల్లో ప్రభుత్వం అతిథిగృహ నిర్మాణం చేపట్టడం కోర్టు ధిక్కరణేనని తెదేపా ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి మండిపడ్డారు. రాజధాని నిర్మాణ సామగ్రిని వైకాపా నేతలు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని ఆమె ఆరోపించారు. అమరావతిలో ఒలంపిక్స్ నిర్వహించాలని చంద్రబాబు కలలు కంటే... వైకాపా నేతలు పేకాట కేంద్రాల నిలయంగా మార్చేశారని దుయ్యబట్టారు.

అమరావతి ఉద్యమంలో పాల్గొంటే రేషన్ బియ్యం నిలిపివేస్తామని రైతులను వాలంటీర్లు బెదిరిస్తున్నారని విమర్శించారు. అమరావతి గుర్తుకొచ్చినప్పుడల్లా రైతులపై కేసులు పెడుతున్నారన్న ఆమె...,ఏడాదిన్నరగా రాష్ట్రాభివృద్ధి ఐసీయూలో ఉందని ఎద్దేవా చేశారు. అప్పులు, పన్నులు, ఆస్తుల అమ్మకం, ప్రశ్నిస్తే దాడులు, ఎదిరిస్తే కేసుల పంచసూత్ర పాలన తప్ప ఏమీలేదని దుయ్యబట్టారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details