ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఈ ప్రభుత్వం చెప్పేదొకటి.. చేసేదొకటి' - తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి

వైకాపా ప్రభుత్వం చెప్పిన వాటికి, చేసే పనులకు పొంతన లేదని.. తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిపై యూటర్న్ తీసుకుంటున్నారని మండిపడ్డారు.

tdp mlc deepak reddy criticises ycp government
దీపక్ రెడ్డి, ఎమ్మెల్సీ

By

Published : Jun 5, 2020, 5:04 PM IST

తుగ్లక్ సీఎం జగన్ డిక్షనరీలో యూ టర్న్​తో పాటు కొత్తగా జే టర్న్ వచ్చి చేరిందని.. తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఎద్దేవా చేశారు. నామినేటెడ్ పోస్టులలో అత్యధికం ఒకే సామాజిక వర్గానికి కేటాయించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కొన్ని పత్రికలపై వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని.. వారికి రావలసిన ప్రకటనల డబ్బులు నిలిపేస్తోందని ఆరోపించారు. జగన్ తుగ్లక్ చర్యలను అనేక జాతీయ పత్రికలు ఎండగట్టాయని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details