జగన్ సొంత ఇలాఖలో పులివెందులలో శాంతిభద్రతలు లోపించాయని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి మండిపడ్డారు. ఈమేర సీఎం జగన్కు లేఖ రాశారు. పులివెందుల ప్రాంతంలో ఇటీవల వరుస హత్యలు, మానభంగాలు జరుగుతున్నాయని తెలిపారు. సీఎం సొంత నియోజకవర్గంలో శాంతిభద్రత లోపిస్తే ఇక రాష్ట్రం పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పోలీసుల తీరు చూసి రాష్ట్రంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రాయలసీమలో ఎలాంటి అలజడులు లేకుండా ఫ్యాక్షనిజాన్ని పాతాళంలో పెటిందని అన్నారు. కానీ జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చశాక ఫ్యాక్షనిజం, అల్లర్లు అశాంతికి ఆజ్యం పోస్తున్నాయని ధ్వజమెత్తారు.
'సీఎం సొంత నియోజకవర్గంలోనే శాంతిభద్రతలు లోపించాయి' - తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి
జగన్ సొంత ఇలాఖలో పులివెందులలో శాంతిభద్రతలు లోపించాయని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపించారు. సీఎం సొంత నియోజకవర్గంలో శాంతిభద్రత లోపిస్తే ఇక రాష్ట్రం పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
!['సీఎం సొంత నియోజకవర్గంలోనే శాంతిభద్రతలు లోపించాయి' btech rav](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12776500-1016-12776500-1628984237765.jpg)
btech rav