బీసీల గొంతు కోసిన ముఖ్యమంత్రికి.. తిరుపతి ఉపఎన్నికల్లో వారంతా ఏకతాటిపైకి వచ్చి బుద్ధి చెప్పాలని తెదేపా ఎమ్మెల్సీ బీటీ నాయుడు పిలుపునిచ్చారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల్లో జనాభా పరంగా 80శాతంగా ఉన్న బీసీలకు ముఖ్యమంత్రి తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. రిజర్వేషన్లు 24శాతానికి తగ్గటం వల్ల 16,800 పదవులు బలహీనవర్గాలు కోల్పోయారని తెలిపారు. 742 వివిధ నామినేటెడ్ పదవులను తన వర్గానికే కట్టబెట్టారని ధ్వజమెత్తారు. మోసపు మాటలతో బీసీ, ఎస్సీ, మైనారిటీలను వంచిస్తున్నారని దుయ్యబట్టారు.
తిరుపతి ఉపఎన్నికల్లో ముఖ్యమంత్రికి బుద్ధిచెప్పాలి: బీటీ నాయుడు
తిరుపతి ఉపఎన్నికల్లో బీసీలంతా ముఖ్యమంత్రికి బుద్ధిచెప్పాలని.. తెదేపా నేత బీటీ నాయుడు పిలుపునిచ్చారు. 742 వివిధ నామినేటెడ్ పదవులను.. సీఎం తన వర్గానికే కట్టబెట్టారని ధ్వజమెత్తారు.
తిరుపతి ఉపఎన్నికల్లో బీసీలంతా ముఖ్యమంత్రికి బుద్దిచెప్పాలి: బీటీ నాయుడు
Last Updated : Mar 19, 2021, 6:11 PM IST