ఎస్ఈసీ ఆదేశాలతో కొందరు వైకాపా నేతలు, మంత్రుల నోళ్లు మూతపడటంతో వారి స్థానాన్ని భర్తీచేయడానికి ప్రయత్నించి.. దువ్వాడ శ్రీనివాస్ భంగపడ్డారని ఎమ్మెల్సీ అశోక్ అన్నారు. అచ్చెన్నాయుడుకి, ఆయన కుటుంబానికి నేరచరిత్ర ఉంటే, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచేవారా? అని అశోక్‌బాబు ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు జైల్లో ఉండే తన గ్రామంలో తెదేపా అభ్యర్థిని గెలిపించుకుంటే, శ్రీనివాస్ కారు బానెట్ ఎక్కి వీరంగం వేసి భంగపడ్డారని ఎద్దేవాచేశారు. అచ్చెన్నాయుడు నేరచరిత్ర గురించి మాట్లాడేముందు జగన్మోహన్ రెడ్డి, ఆయన తండ్రి, తాతల నేరచరిత్ర గురించి తెలుసుకుంటే మంచిదని హితవుపలికారు. వారిచరిత్ర ఆయనకు తెలియకపోతే, తెదేపా కార్యాలయానికి వస్తే, పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తెలియజేస్తామన్నారు. ఎప్పటికీ అచ్చెన్నాయుడిపై గెలవలేననే శ్రీనివాస్ కింజారపు కుటుంబంపై చౌకబారు ఆరోపణలకు దిగారని అశోక్‌బాబు ఆరోపించారు.
దువ్వాడ శ్రీనివాస్.. అలా నటించలేకపోయారు: ఎమ్మెల్సీ అశోక్ - దువ్వాడ శ్రీనివాస్‌పై అశోక్ బాబు కామెంట్స్
వైకాపా నేత దువ్వాడ శ్రీనివాస్‌పై ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శలు గుప్పించారు. వైకాపా చెప్పినంత బాగా నేడు మీడియా ముందు నటించలేకపోయారని విమర్శించారు.
![దువ్వాడ శ్రీనివాస్.. అలా నటించలేకపోయారు: ఎమ్మెల్సీ అశోక్ tdp mlc ashok babu on ysrcp leader duvvada srinivas](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10612944-587-10612944-1613217959428.jpg)
tdp mlc ashok babu on ysrcp leader duvvada srinivas