ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం, మంత్రులు మతిమరుపుతో బాధపడుతున్నారు: తెదేపా ఎమ్మెల్సీ అశోక్​ బాబు - mlc ashok babu latest news

వైకాపా నేతలపై తెదేపా ఎమ్మెల్సీ అశోక్​బాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డికి తన పరిపాలనపై.. తనకే నమ్మకం లేదన్నారు.

tdp mlc ashok babu
తెదేపా ఎమ్మెల్సీ అశోక్​ బాబు

By

Published : Jan 15, 2021, 11:39 AM IST

వైకాపా నేతలు నాడు ఎన్నికలు పెట్టడం రాజ్యాంగబద్ధమనీ.. నేడు రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమంటున్నారని తెదేపా ఎమ్మెల్సీ అశోక్​బాబు మండిపడ్డారు. మాట తిప్పం.. మడప తిప్పం అంటూ కరోనాపై నవ వంకరులు తిరిగిన చరిత్ర జగన్​దేనని దుయ్యబట్టారు. కరోనాను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్న ఏకైక పార్టీగా చరిత్రలో వైకాపా చరిత్రలో నిలిచిపోతుందని ఎద్దేవా చేశారు.

ఎన్నికలు సజావుగా జరిగితే అరాచకాలకు తావుండదని భయపడుతున్నారా అని ప్రశ్నించారు. కరోనా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు ఎన్నికలు జరపాలని హడావుడి చేసి.. లేనప్పుడు ఎన్నికలు వద్దనటం ఏంటంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి, మంత్రులు మతిమరుపుతో బాధపడుతున్నారా అని అశోక్ బాబు నిలదీశారు. జగన్మోహన్​రెడ్డికి తన పరిపాలనపై తనకే నమ్మకం లేదనీ... స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని భయపడుతున్నారని విమర్శించారు.

ఇదీ చదవండి:వైపీఎస్ అధికారిలా డీజీపీ ప్రవర్తిస్తున్నారు: తెదేపానేత సుధాకర్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details