సంక్షేమ పథకాలకు రూ.41వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెబుతున్న ప్రభుత్వం.. ఆ మొత్తాన్ని మద్యం ద్వారా వసూలు చేస్తోందని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు. మద్యాన్ని జగన్ ప్రభుత్వం వాడుకున్నట్లు ప్రపంచంలో ఎవ్వరూ వాడుకోవడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి అప్పు తేవాలన్నా.. అవినీతి చేయాలన్నా.. కార్యకర్తలు బాగుపడాలన్నా అన్నింటికీ మద్యమే ప్రధాన వనరుగా ఉందని ఆరోపించారు. మద్యం అమ్మకాల్లో జరిగిన అవినీతిపై ముఖ్యమంత్రి, ఎక్సైజ్ మంత్రి, అధికారులు ఎవ్వరైన.. చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
'సంక్షేమ పథకాలకు నగదును మద్యం ద్వారా సమకూరుస్తున్నారు' - వైకాపాపై ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపాటు
సంక్షేమ పథకాలకు కావాల్సిన మొత్తాన్ని.. ప్రభుత్వం మద్యం ద్వారా వసూలు చేస్తోందని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు. మద్యాన్ని జగన్ ప్రభుత్వం వాడుకున్నట్లు ప్రపంచంలో ఎవ్వరూ వాడుకోవడం లేదని ఆయన విమర్శించారు.
'సంక్షేమ పథకాలకు కావాల్సిన మొత్తాన్ని మద్యం ద్వారా సమకూరుస్తున్నారు'