ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Ashok babu : 'ప్రకటనల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు' - ashok babu latest news

వైకాపా ప్రభుత్వ తీరుపై తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో ఇచ్చిన ఉద్యోగాలను జగన్ ఏలుబడిలో ఇచ్చామని చెప్పుకోవడం దారుణం అని అశోక్ బాబు అన్నారు.

TDP mlc ashok babu
తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు

By

Published : Jun 19, 2021, 2:17 PM IST

చేయనివి చేసినట్లుగా చెప్పుకోవడంలో వైకాపా ప్రభుత్వానికి కలిగే ఆనందం ఏంటో తనకు అర్థం కావటం లేదని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. తెదేపా హయాంలో చంద్రబాబు ఇచ్చిన ఉద్యోగాలను వైకాపా ప్రభుత్వం ఇచ్చినట్లుగా చెప్పుకోవటం దారుణమని విమర్శించారు.

వైకాపా పాలనలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమనైనా తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. ఉద్యోగ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రకటనల కోసం కోట్ల రూపాయలు వెచ్చించి, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అశోక్ బాబు మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details